తాడిగడప మున్సిపాలిటీ కానూరులోని మన కల్యాణ మండపం సమీపంలో ఉన్న యడ్లపల్లి సత్యం గారి వీధిలోని రోడ్డు.. పెద్ద పెద్ద గోతులతో అధ్వాన్నంగా మారడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీరు చేరి రహదారంతా బురదమయంగా మారింది. ఈ రోడ్డులో రాకపోకలకు నరకయాతన అనుభవిస్తున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.