నందమూరు సహకార బ్యాంకు పెట్రోల్ బంక్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొని సోమవారం ఇరువురికి తీవ్ర గాయలయ్యాయి. వైద్య సేవలు నిమిత్తం క్షతగాత్రులను 108 వాహనంలో మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారు బందరు బలరాంపేటకు చెందిన వారుగా గుర్తించారు. పెట్రోలు బంకు వద్ద సూచిక బోర్డులు లేక ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారని పోలీసు వారు స్పందించి సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.