త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం గ్రాడ్యుయేట్స్ అందరూ కొత్త ఓటు నమోదు చేసుకోవాలని పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. త్వరలో జరగనున్న కృష్ణా–గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో గ్రాడ్యుయేట్లు అందరూ ఓటు వేసేందుకు తక్షణం కొత్త ఓటు నమోదు చేసుకోవాలని కోరారు.