మైలవరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో మైలవరం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గా చారుగండ్ల. ప్రసాద్ , డైరెక్టర్లుగా జెల్లి కృష్ణ, షేక్ షేహనాజ్ బేగం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు జంపాల సీతారామయ్య, కూటమి నాయకులు పాల్గొన్నారు.