ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, యువ కార్యకర్త కర్ల సాయికుమార్ గుండెపోటుతో గురువారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు మధ్యాహ్నం మూలపాడు గ్రామంలోని వారి నివాసానికి విచ్చేసి సాయికుమార్ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్థీవదేహంపై పార్టీ జెండాను కప్పారు.