పెరుగుతున్న ధరల నియంత్రణలో భాగంగా నేటి నుంచి కృష్ణా జిల్లాలోని అన్ని రైతు బజార్లలో వంట నూనె, టమాటాలు తక్కువ ధరకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించనున్నట్లు కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. గురువారం మచిలీపట్నంలో ఆమె మాట్లాడుతూ, సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ. 124, పామోలిన్ లీటరు రూ. 114లకు, కేజీ టమాటాలు రూ. 50లకు విక్రయించనున్నట్టు చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.