పంట నష్టం అంచనాల్లో అధికారులు తలమునకలయ్యారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, కృష్ణానదికి సంభవించిన వరదల కారణంగా జిల్లాలో పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు 44, 521 హెక్టార్లలో పలు రకాల పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు లెక్కలు వేశారు. ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు బృందాలు క్షేత్ర స్థాయిలో పొలాలను పరిశీలించి నివేదికలు తయారు చేస్తున్నట్లు శుక్రవారం తెలిపారు.