జగ్గయ్యపేట సమీపంలోని ఆటోనగర్ లో గల ఎస్ ఎస్ ఫార్మా కంపెనీలోని కార్మికులకు గాయాలు అయిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. మల్కాపురం గ్రామానికి చెందిన ఇరువురు రోజువారి కూలీకి వెళ్లారు. యాజమాన్యం కెమికల్ బ్యాగులు, ఐస్ బాక్స్ లను ఫ్యాక్టరీలో కింద నుండి పై ఫ్లోర్ కు తీసుకువెళ్లారు. ఫ్యాక్టరీ నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇరువురు కార్మికులకు దురదలు వచ్చాయి.
దీంతో ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స పొందారు.