గుడివాడ ఫ్లై- ఓవర్ మీద మంగళవారం జరిగిన రోడ్ ప్రమాదంలో అక్కడ ప్రజలంతా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఫోటోలు, వీడియోలు తీస్తూ బిజీగా ఉంటే అటు వెళ్తున్న జూ. జర్నలిస్ట్ గూడపాటి శ్రీకాంత్, అతని బామ్మరిది వినోద్ కుమార్ రక్తపుమడుగులో పడి ఉన్న ఆ వ్యక్తిని లేపి ఆ రక్త శ్రావాని శుభ్రం చేసి తలకు అయిన గాయానికి గుడ్డ కట్టారు. తమ ద్విచక్ర వాహనం మీద హుటాహుటిన గుడివాడ ఏరియా ఆసుపత్రికి తీసుకొని వెళ్లి ప్రధమ చికిత్స చేయించినారు.