బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో నీసంతాన వేణుగోపాలస్వామి దేవస్థానం పునర్నిర్మాణం తర్వాత, ప్రధాన గేట్లను ఒక లక్ష 40 వేలు ఖర్చు చేసి గ్రామానికి చెందిన కొల్లి రామ్మోహన్ రావుదంపతులు శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు లంక సురేంద్రమోహన్ బెనర్జీ, గుండపనేని ఉమా వరప్రసాద్, లంక రవి శ్రీనివాస్, కోడే బోయినబాబి ఈవో శ్రీనివాస్, కలపాల నాని పాల్గొన్నారు.