మోపిదేవి: రోడ్డుకిరువైపులా డ్రైనేజీ తీయించండి
మోపిదేవి మండలం వెంకటాపురం గ్రామపంచాయతీలో రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజీ తీయించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు రోడ్డుపై చేరి వాహనదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, డ్రైనేజీ లేకపోవడంతో వర్షపు నీరు రోడ్డుపై చేరి గుంతలు కనపడక ప్రమాదాలకు గురవుతున్నామన్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు.