అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో హంసలదీవి బీచ్ వద్దకు మెరైన్, పోలీస్ అనుమతించిన సమయంలోనే వెళ్లాలని మెరైన్ సీఐ సురేష్ రెడ్డి తెలిపారు. ఆదివారం బీచ్ ఎంట్రన్స్ గేటు వద్ద ప్రత్యేక బ్యానర్ ఏర్పాటు చేసి బీచ్ వద్దకు వచ్చు పర్యాటకులకు ఆదివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే బీచ్ వద్దకు పర్యటకులను అనుమతిస్తున్నట్లు తెలిపారు. బీచ్ వద్ద చిన్న పిల్లలను వదలరాదన్నారు.