మోపిదేవి మండలంలో గత ప్రభుత్వంలో నిర్మించిన మల్టీపర్పస్ గోడౌన్లను వినియోగంలోకి తీసుకురావాలని పలువురు రైతులు కోరుతున్నారు. పెదప్రోలు శివారు కప్తానుపాలెం వద్ద రూ. 40లక్షలతో నిర్మించనున్న మల్టీపర్పస్ గోడౌన్ నిరుపయోగంగా మారిందని రైతులు ఆరోపించారు. గోడౌన్‌కు వెళ్లే రహదారి లేక, గోడౌన్ భవనం నిర్మాణం అసంపూర్తిగా మిగిలిందన్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి గోడౌన్ వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.