ఎస్సీ వర్గీకరణ, క్రిమిలేయర్ అడ్డుకుంటామని ఆంధ్రప్రదేశ్ మాలమహానాడు వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు పంతగాని రమేష్ పేర్కొన్నారు. శుక్రవారం ఘంటసాల మండలం దేవరకోట, ఘంటసాల గ్రామాల్లో ఆయన పర్యటించారు. పంతగాని రమేష్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను పరిరక్షించుకుంటామని పిలుపునిచ్చారు. 1935 నుండి వున్న రిజర్వేషన్స్ ఎత్తివేసే కుట్రను మాలమహానాడు ప్రజా పోరాటాల ద్వారా అడ్డుకుంటామని అన్నారు.