మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలామ్ ఆదర్శనీయుడని రాజోలు ఎంపీపీ కేతా శ్రీనివాస్ కీర్తించారు. రాజోలు మండల పరిషద్ కార్యాలయంలో మంగళవారం మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మాన్ డాక్టర్ అబ్దుల్ కలామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఎంపీపీ శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. కలామ్ అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆనందరాజు పాల్గొన్నారు.