ప్రజా జీవనానికి రహదారులే కీలకమని రహదారుల భద్రత ప్రజల భద్రతతో సమానమని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. రాజానగరం నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితిపై ఆర్ & బి అధికారులతో ఎమ్మెల్యే బత్తుల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా సీతానగరం రహదారి పనులను సమీక్షించి త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు.