రాజమండ్రిలోని శ్యామల నగర్ కు చెందిన శ్రీనివాస్ ఇంట్లో జరిగిన దొంగతనంపై కేసు నమోదు చేశామని డీఎస్పీ రమేశ్ బాబు, సీఐ బాజీలాల్ మంగళవారం తెలిపారు. బాధితుడు దసరా సెలవులకు హైదరాబాదులోని బంధువుల ఇంటికి గత నెల 29న వెళ్లారని చెప్పారు. ఈ నెల 14న ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం తీసి ఉందన్నారు. ఇంట్లోని 250 గ్రాములు బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని, బాధితుడు చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామన్నారు.