ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి ప్రజా సమస్యలపై ఫిర్యాదు చేసే అర్జీదారులకు సంతృప్తికరమైన న్యాయం చేయాలని రాజమండ్రి ఆర్డీవో కృష్ణ నాయక్ అధికారులకు సూచించారు. సోమవారం రాజమండ్రిలోని ఆర్డీవో కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఆయన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.