పెద్దాపురం మండలం మర్లావ ఫీడర్ పై విద్యుత్తు మరమ్మతులు నిర్వహిస్తున్నందున ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పలు గ్రామాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఎలక్ట్రికల్ ఈఈ ఏవీఎన్డీఎస్ ప్రభాకర్ తెలిపారు. దివిలి విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో చదలాడ, ఉలిమేశ్వరం, కాండ్రకోట, గుడివాడ, సిరివాడ, తూర్పుపాకలు, మర్లావ గ్రామాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని తమకు సహకరించాలని కోరారు