నవంబర్ 4న కొవ్వూరులో ఉన్న గోదావరి నదికి మహా హారతి ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆర్డీవో సుస్మిత రాణి తెలిపారు. బుధవారం ఆమె కొవ్వూరులోని ఆర్డీవో కార్యాలయం వద్ద సంబంధిత శాఖల అధికారులతో మహా హారతి ఉత్సవం నిర్వహణపై బుధవారం సమావేశం నిర్వహించి చర్చించారు. తిరుమల తిరుపతి దాసా సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఈ మహా హారతి కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.