డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు పోలీస్ స్టేషన్ లో ఎస్సై ఎం. అశోక్ డి. జే యజమాను లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సౌండ్ బాక్స్ లకు పర్మిషన్ లేకుండా డీజే బాక్సులు పెట్టవద్దన్నారు. ఇటీవల అమలాపురం లో ఒక యువకుడు డి. జె బాక్స్ ఎఫెక్ట్ వలన హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయి నందున భవిష్యత్తులో మరి ఏ ఇతర సంఘటనలు పునరావృతం కాకుండా, సరైన నియమ నిబంధనలను పాటించాలన్నారు.