మహిళల కోసం రక్షక్ వాహన సేవలను అందుబాటులోకి తీసుకు రావడం జరిగిందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో మహిళా రక్షక్ వాహన సేవలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ మహిళా రక్షక్ వాహనాలు అన్ని పోలీస్ స్టేషన్ లలో అందుబాటులో ఉంటాయన్నారు. ఈ వాహనాలలో మహిళ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్ అందుబాటులో ఉంటారన్నారు.