కాకినాడ జిల్లాలో రానున్న మూడు నెలల పాటు గ్రామ స్థాయిలో నిర్వహిస్తున్న జన సురక్ష కార్యక్రమాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరూ అత్యంత ప్రయోజన దాయకమైన కేంద్ర ప్రభుత్వ భీమా పధకాలలో నమోదు పొందేలా చూడాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి బ్యాంకర్లు, జిల్లా అధికారులను కోరారు. శుక్రవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో గ్రామస్థాయి జన సురక్ష కార్యక్రమం వివరాల గోడపత్రికను ఆవిష్కరించారు.