నోటు సారా తయారీ కట్టడి భాగంగా మంగళవారం జగ్గంపేట మండల గ్రామాల్లో పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. కాట్రావులపల్లి, మల్లి శాల, గోవిందాపురం గ్రామాల్లో సారా తయారీకి ఉపయోగించే 800 లీటర్ల బెల్లం ఊటలను ధ్వంసం చేసి, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో నిందితులు పరారీలో ఉన్నట్లు జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వై ఆర్ కె శ్రీనివాస్ తెలిపారు.