అంతర్ జిల్లా దొంగల ముఠాను కాకినాడ జిల్లా గండేపల్లి పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. సీఐ వైఆర్కే శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటోలలో, బస్సులలో ప్రయాణికుల వేషధారణలో తిరుగుతూ బ్యాగులలో ఉన్న విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేసే నలుగురు మహిళలు, ఒక పురుషుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 5 లక్షల విలువ గల బంగారం, ఒక కారు స్వాధీన పరుచుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామన్నారు.