గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామంలో చెత్త నుంచి సంపద తయారీ, పంచాయతీ నిధులు, జలజీవన్ మిషన్, ఉపాధి హామీ నిధులపై జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని కూటమి నాయకులు కోరుతున్నారు. ఉప్పలపాడులో జనసేన నాయకులు మేడిబోయిన శ్రీను, సత్తి సోమరాజు తదితరులు మీడియాతో మాట్లాడారు. నిధులు దుర్వినియోగంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై ఉన్నత అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు.