విశాఖ: అధ్యయన యాత్ర రద్దు చేయాలి
ప్రజాధనంతో నిర్వహించే విశాఖ జీవీఎంసీ కార్పొరేటర్ల అధ్యయన యాత్రను రద్దు చేయాలని సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం. జగ్గునాయుడు డిమాండ్ చేశారు. ఈ యాత్రను సీపీఎం వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం జగదాంబ జంక్షన్ వద్ద గల సీపీఎం కార్యాలయంలో 78వ వార్డు కార్పొరేటర్ గంగారావుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఈ టూర్‌ను అన్ని పార్టీలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.