కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట్ లో సోమవారం పని మీద బయటకు వెళ్లిన కుమ్మరి మల్లయ్య కుమారుడిని తీసుకొని ఇంటికి వస్తుండగా వీధి కుక్కలు పైన పడ్డాయి. నెల రోజుల క్రితం ఇదే గ్రామంలో బాలుడి పై కుక్కల దాడి మరవకముందే మరో సారి వీధి కుక్కల స్వైర విహారం చేయటం పై స్థానికులు మండిపడుతున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే వీధి కుక్కల బెడద లేకుండా చేయాలని కోరుతున్నారు.