ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి ప్రారంభమయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో నవంబరు 6వ తేదీ వరకు ఆన్లైన్/ఆఫ్లైన్లో ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించింది. ప్రస్తుత ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ పదవీకాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనున్నది.