కాకినాడ జిల్లా తుని పట్టణంలో గురువారం రాత్రి అన్నా క్యాంటీన్లను మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రారంభించారు. పేదవాడి ఆకలి తీర్చేందుకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా ఈ అన్న క్యాంటీన్ ప్రారంభించినట్లు యనమల తెలిపారు. తొలి రోజు స్వయంగా పలువురికి యనమల రామకృష్ణుడు వడ్డిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.