తమ సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 25వ తేదీ నుంచి సమ్మెకు దిగుతున్నామని 108 సిబ్బంది తెలిపారు. సోమవారం తొండూరు మండలంలోని స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్ రామచంద్రుడును వారు కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా 108 సిబ్బంది గిరిధర్ రెడ్డి, రామాంజనేయరెడ్డిలు మాట్లాడుతూ.మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం 108 ఉద్యోగులు సమ్మె బాట పట్టాలని నిర్ణయించుకున్నామన్నారు.