ప్రజా సమస్యలపై ప్రత్యేకదృష్టి సారిస్తున్నామని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తన నివాసంలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంతోపాటు ఇతర ప్రాంతాల ప్రజలు కూడా ఎమ్మెల్సీని కలిసి వారి సమస్యలను వినతిపత్రాల రూపంలో సమర్పించారు. స్పందించిన ఎమ్మెల్సీ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి పరిష్కరించాలని కోరారు. సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.