వేంపల్లె: చిన్న నాటి జ్ఞాపకాలు ఎప్పుటికి మధుర స్మతులుగా నిలిచి పోతాయని ఎంఇఓ వీరారెడ్డి, రిటైర్డ్ ఎంఇఓ సోమిరెడ్డి లు పేర్కొన్నారు. స్థానిక తల్లిశెట్టి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని 1996-97 బ్యాచ్ కు చెందిన పదోతరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంను వేమయ్య, శివ శంకర్, మెఖైల్ , శ్రీను, సుబ్బారావు, చెన్నకేశవ, గురు, దర్బార్, సుబ్బారెడ్డి, కృష్ణయ్య ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో స్థిరపడిన పూర్వ విద్యార్థుల అందరూ బాలుర పాఠశాల ఆవరణలో ఒకే చోట కలుసుకొని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆనాటి ఉపాధ్యాయులు తమ పట్ల చూపిన అభిమానానికి ఆ పూర్వ
విద్యార్థులు నమస్కార వదనంతో ఘనంగా సత్కరించి గౌరవించారు. దాదాపు 27 ఏళ్ళ తరువాత ఈ ఆత్మీయ సమ్మేళనం చేసుకోవడం సంతోషంగా ఉందని పూర్వ
విద్యార్థులు అన్నారు. క్లాస్ మేట్స్, బెంచ్‌మేట్స్ ఆత్మీయ ఆలింగనంతో ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. ఈసందర్భంగా పూర్వ
విద్యార్థులు మాట్లాడుతూ చదువు చెప్పిన గురువులను మరచిపోకుండా వారిని గౌరవించడం మన బాధ్యతగా భావించి సత్కరించామన్నారు. వివిధ రంగాలలో తమ స్నేహితులు మంచి హోదాలో ఉండడం కొందరు స్వయం ఉపాధిలో మరికొందరు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో ఉండడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. పాఠశాలలో చదివి 27 ఏళ్లు అవుతున్నా గత స్మృతులను గుర్తుంచుకొని పాఠశాలలో సమ్మేళనం నిర్వహించడం అభినందనీయమని ఎంఇఓ వీరారెడ్డి, రిటైర్డ్ ఎంఇఓ సోమిరెడ్డిలు అన్నారు. అనంతరం స్నేహితులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు ఆరగించారు. ఈ కార్యక్రమంలో పూర్వ
విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.