వేంపల్లె మండలం అభివృద్ధి అధికారిగా ఏ. విజయ రాఘవ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనను సాదరాభిమానంగా ఆహ్వానం పలుకుతూ.. శుభాకాంక్షలు తెలియజేశారు. లక్కీరెడ్డిపల్లి మండల అభివృద్ధి అధికారిగా విధులు నిర్వహిస్తున్న నైపధ్యంలో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు వేంపల్లె మండలానికి ఎంపిడిఓగా విచ్చేశారు. మండలాభివృధ్ధికి కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని చెప్పారు.