వైద్యం కోసం పేదల నుంచి పెద్దల వరకు ఎవరు ఇబ్బంది పడకుండా వారి ఇంటి వద్ద మెరుగైన వైద్యం అందించడానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద వైద్యం అందిస్తున్నారని బ్రహ్మంగారిమఠం వైఎస్‌ఆర్‌సిపి మండల వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ నాయుడు అన్నారు. గురువారం రేకలకుంట గ్రామ సచివాలయం నందు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంగముని రెడ్డి, తహసిల్దార్ సువర్ణాదేవి పాల్గొన్నారు.