సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి నర్సింహారెడ్డి అన్నారు. పోరుమామిళ్ల మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం డ్రై డే అంశంపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇంటిలోని కూలర్లలో దోమలు అధికంగా ఉంటాయని కావున దోమల నివారణ మందులు పిచికారీ చేయాలని చెప్పారు. దోమ కాటుకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.