బద్వేల్-నెల్లూరు రోడ్డులో ఉన్న టైర్ల షాపును సోమవారం మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి పరిశీలించారు. పాత టైర్ ఎక్కడైనా వుంటే మూడు రోజుల లోపు తొలగించాలని దుకాణ యజమానులకు హెచ్చరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాత టైర్లు ఇలా బయట వేయడం ద్వారా అందులో నీరు నిల్చి దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, చికెన్ గున్య లాంటి విష జ్వరాలు వస్తాయన్నారు. పరిసరాలు, ఇంటి ఆవరణము చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.