కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అంగన్వాడి కేంద్రాలకు అందుతున్న పౌష్టికాహారాన్ని గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. ఆదివారం మాచర్ల మండల పరిధిలోని జమ్మలమడక గ్రామంలో నిర్వహించిన పోషక మాసోత్సవాలలో భాగంగా సామూహిక సీమంతాల కార్యక్రమాన్ని నిర్వహించారు.