చెరుకుపల్లిలో సోమవారం ఉదయం భారీ వర్షం దంచి కొట్టింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీచేసిన నేపథ్యంలో సోమవారం వేకువజాము నుంచే అల్పపీడన ప్రభావం కనిపించింది. నేటి నుంచే పాఠశాలలు, కళాశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు స్కూల్, కాలేజీలకు వెళ్లేందుకు రాగా భారీ వర్షం కురవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.