పెదకూరపాడు సివిల్ సప్లయీస్ ముఠా కార్మికులకు కూలీ రేట్ల అగ్రిమెంట్ ఏరియర్స్ తో కూడిన జీవోను వెంటనే విడుదల చేయాలని, రూటు ఆప్టిమేషన్ రద్దు చేయాలని, నియోజకవర్గ ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు మునగోటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పెదకూరపాడు సివిల్ సప్లై గూడెం కార్యాలయం వద్ద శుక్రవారం మోకాళ్ళపై నిరసన వ్యక్తం చేశారు. చిన్ని యాకోబు రతన్ రాజు అనిల్ కొండలరావు సుధాకర్ పురుషోత్తమరావు పాల్గొన్నారు.