పెదకూరపాడు మండలం 75త్యాల్లూరు జెడ్పీ హైస్కూల్లో మినిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ఉత్తర్వులను అనుసరించి పంచప్రాణ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే పంచప్రాణ్ శుక్రవారం ప్రతిజ్ఞ చేయించారు. మేకర్స్ ఆప్ కంట్రీ అనే అంశంను విద్యార్థులకు వివరించి దేశాభివృద్ధికి అన్ని వృత్తులు ముఖ్యమని, దగ్గరలో ఉన్న వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్ళి అనేక విషయాలపై అవగాహన కల్పించారు.