టీడీపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఈ నెల 26న ప్రారంభమవుతుందని. దీనిని విజయవంతం చేయాలని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు శ్రేణులకు పిలుపునిచ్చారు. నరసరావుపేటలో విస్తృత స్థాయి సమావేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ మాట్లాడుతూ ప్రతి రెండేళ్లకు ఒకసారి సభ్యత్వ నమోదు, పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు.