దీపారాధన జయప్రదానికి గాదె పిలుపు

51பார்த்தது
దీపారాధన జయప్రదానికి గాదె పిలుపు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా ఈ నెల 30న సోమవారం దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె. వెంకటేశ్వరరావు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల నుంచి గుంటూరు గోరంట్లలోని వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. వార్డ్ కమిటీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி