బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్రతో పాటు మీడియా ప్యానలిస్ట్ పాలిబండ్ల రామకృష్ణ గురువారం రాజీనామా చేశారు. మహిళలతో అసభ్యకరంగా మాట్లాడినట్లు సోషల్ మీడియాలో కథనాలు రావడంతో బీజేపీ అధిష్ఠానం సీరియస్ అయింది. దీంతో పార్టీ అధ్యక్ష పదవికి నరేంద్ర రాజీనామా చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన రాజీనామాను రాష్ట్ర పార్టీ శాఖ వెంటనే ఆమోదించింది. ఇక సుకన్యను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.