గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బాధితులు పోలీస్ కార్యాలయంకు తరలివచ్చారు. ఫిర్యాదుదారులతో ఎస్పీ కార్యాలయం కిటకిటలాడింది. ఎస్పీ సతీశ్ కుమార్ ఆదేశాలతో ఏఎస్పీ రమణమూర్తి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల ఫిర్యాదులను చట్టపరిధిలో సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.