ప్రైవేటు విద్యా సంస్థల్లో అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ కోరారు. గుంటూరులోని ప్రైవేటు విద్యా సంస్థల నిర్వాహకులతో శనివారం ఆయన సమావేశమయ్యారు. విద్యార్థుల కదలికలపై పరిశీలన ఉండాలని, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలనిచెప్పారు. విద్యార్థుల సమస్యలను కూడా ఎప్పటికప్పుడు అధ్యాపకులు, ఉపాధ్యాయులు పరిశీలించాలన్నారు.