చిలకలూరిపేట హాస్పటల్ వద్ద వసంతరావు బంధువులు నిరసన

65பார்த்தது
చిలకలూరిపేటలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఆత్మహత్య చేసుకున్న కారుచోల వసంతరావు బంధువులు ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసనకు దిగారు. వసంతరావుది ఆత్మహత్య కాదని, అతన్ని హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మృతుడి బంధువులు, ఎమ్మార్పీఎస్ నాయకులు కలిసి రోడ్డుమీద బైఠాయించి నిరసన తెలిపారు. పట్టణ సీఐ రమేశ్ ధర్నా చేస్తున్న వారితో మాట్లాడి వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி