రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: ఎమ్మెల్యే

72பார்த்தது
రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: ఎమ్మెల్యే
రేషన్ డీలర్లు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. నాదెండ్ల మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే పాల్గొని అర్జీలు స్వీకరించారు. నియోజవర్గమంతా రేషన్ సరకులు సక్రమంగా అందించాలన్నారు. పప్పులు, నూనెలు సహా ఏవీ పక్కదారి పట్టకుండా సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత రేషన్ డీలర్లు, అధికారులపై ఉందన్నారు.

தொடர்புடைய செய்தி