కోల్ కత్తాలో జూనియర్ డాక్టర్ పై హత్యాచారం చేసిన నిందితులు పై కఠిన చర్యలు తీసుకోవాలని ఢీమాండ్ చేస్తూ చిలకలూరిపేట పట్టణంలో శనివారం మానవహారం నిర్వహించారు. అనంతరం ర్యాలీ గా చిలకలూరిపేట పట్టణ వైద్యులు, న్యాయవాదులు, రోటరీ క్లబ్ ఆఫ్ పండరిపురం, ఓయాసిస్ సంస్థ తదితరులు నిరసన వ్యక్తం చేస్తు చిలకలూరిపేట తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు.