అద్దంకిలోని సుందరయ్య భవనం నందు సోమవారం సిపిఎం ప్రాంతీయ కమిటీ 12వ మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రమాదేవి పాల్గొని మాట్లాడారు. బిజెపి దేశంలో మతతత్వాన్ని రెచ్చగొట్టే విధంగా పాలన సాగిస్తుందని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పేరుతో 20వేల కోట్ల భారం ప్రజలపై వేసేందుకు సిద్ధమైందని రమాదేవి విమర్శించారు.